Friday, November 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 127



lalitaskaMdhamu

1-22-ma.
lalitaskaMdhamu, kRshNamoolamu, SukaalaapaabhiraamaMbu, maM
julataaSObhitamun, suvarNasumanassuj~naeyamun, suMdarO
jjvalavRttaMbu, mahaaphalaMbu, vimalavyaasaalavaalaMbunai
velayun bhaagavataakhyakalpataru vurvin saddvija Sraeyamai.
1-22-మ.
లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
          శూలికైన దమ్మిచూలికైన తెలిసి పలుకుట చిత్రమై నట్టి శ్రీమద్భాగవత మహా పురాణం సాక్షాత్తు కల్పవృక్షమే. ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయం పోతనామాత్యులవారు రెండు రకాల  అన్వయార్థాలు గల మత్తేభ రూపంలో వివరించారు. అంటే గజారోహణ సన్మానం చేస్తారు కదండి అలా సన్మానిస్తు భాగవతం సర్వఫలసిద్ధి సంధాయకం అన్నారు అన్నమాట. కరుణశ్రీ గారు అన్నట్లు - భాగవత కల్పవృక్షాన్ని తెలుగు వారికి అందించిన  మీప్రతిభ అప్రతిమానం కదా, పోతన గారు ! మీరు ధన్యులండి.

ఇది భాగవతం అనే పేరుతో విరాజిల్లేది
ఇది కల్పవృక్షం అనే పేరుతో ప్రకాశించేది.
భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది.
కల్పవృక్షం మాను మనోజ్ఞ మైంది.
భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడు.
కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది.
భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది.
కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది
భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది
కల్పవృక్షం అందమైన పూల తీగలుచే అలంకరింప బడినది
భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది.
కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది
భాగవతం సుందరము ఉజ్వలము అయిన వృత్తాంతాలు గలది.
కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది.
భాగవతం  కైవల్యాది కామిత ప్రయోజనాలు  సర్వం సమకూర్చేది.
కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది.
భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది.
కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలతగల మాను కలిగినది.
భాగవతం భూలోకంలో విరాజిల్లుతోంది.
కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది.
భాగవతం ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.
కల్పవృక్షం శుక పికాది పక్షులకు శ్రేయస్కర మైనది.
          లలిత = చక్కని / అందమైన; స్కంధము = మానుతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులుతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళుతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; అలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; = అయ్యి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పతరువు; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలుకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, November 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 126


nee vaaramu


9-618-క.
నీవారము ప్రజ లేమును
నీవారము పూజగొనుము నిలువుము నీవున్
నీవారును మా యింటను
నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా!
9-618-ka.
neevaaramu prajalaemunu
neevaaramu pooja gonumu niluvumu neevun
neevaarunu maa yiMTanu
neevaaraannaMbugonu@MDu nae@MDu naraeMdraa!
          ఓ రాజా! పౌరులు, మా ఆశ్రమ వాసులం అందరం నీ వాళ్ళమే నయ్యా! ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా యింట్లో నివ్వరి అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు. – అని శకుంతల తమ కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటు ప్రతి పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నెతెచ్చింది. ఒకటి కంటె ఎక్కువ అక్షరాలు అర్థ భేదంతో ఒకటి కంటె ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. నాలుగు పాదాలలో నీవాళ్ళం, ఈరోజు, నీపరిజనులు, చక్కటిభోజనం అనే నాలుగు అర్థ భేద ప్రయోగాలతో ఇక్కడ యమకం చక్కగా పండింది.
          నీ = నీకు చెందిన; వారము = వాళ్ళము; ప్రజలున్ = పౌరులు; ఏమునున్ = మేము కూడ; = ; వారమున్ = రోజు; పూజన్ = మా పూజలను; కొనుము = అందుకొనుము; నిలువుము = ఆగుము; నీవున్ = నీవు; నీ = నీయొక్క; వారునున్ = పరివారము; మా = మా యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీవారి = నివ్వరియైన {నీవారము - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి}; అన్నంబున్ = అన్నమును; కొనుడు = తీసుకొనండి; నేడు = ఇవాళ; నరేంద్రా = రాజా .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, November 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 125



punnaaga

10.1-1010-సీ.
పున్నాగ కానవే! పున్నాగవందితుఁ; దిలకంబ! కానవే తిలకనిటలు;
ఘనసార! కానవే నసారశోభితు; బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే న్మథాకారుని; వంశంబ! కానవే వంశధరునిఁ;
జందన! కానవే చందనశీతలుఁ; గుందంబ! కానవే కుందరదను;
తే. నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ;
గువల వృక్షమ! కానవే కువలయేశుఁ;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;
ననుచుఁ గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.
          శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు సమస్త చరాచర జగత్తు అంతట వసించి ఉండే వాసుదేవుణ్ణి అందాల గోపభామినులు యమునాతీరంలో ప్రేమతో వివశులై పాడుతు వెదుకుతున్నవిధం చెప్తున్నారు గజేంద్రునిచే స్తుతింపబడ్డాడు వానిని చూసావా? ఓ పున్నాగ చెట్టు!నుదుట బొట్టు చక్కగా పెట్టుకొనే అతనిని చూసవా? ఓ బొట్టుగ చెట్టు! గొప్ప బలంతో భాసిల్లే వానిని చూసావా? ఓ కర్పూరపు అరటిచెట్టు! చుట్టాలకు చెలికాడైన వానిని చూసావా? ఓ మంకెన చెట్టు! మన్మథుని వంటి చక్కదనం గల వానిని చూసావా? ఓ వెలగ చెట్టు! వేణువు పట్టుకొని వాయిస్తుంటాడు వానిని చూసావా? ఓ వెదురుపొదా! మంచిగంధంలా చల్లటి వానిని చూసావా? ఓ చందనం చెట్టు! మొల్లమొగ్గల్లాంటి పళ్ళు కల అతనిని చూసావా? ఓ మొల్ల చెట్టు! దేవేంద్ర వైభవంతో వెలిగిపోయే వానిని చూసావా? ఓ మరువం చెట్టు! అతడే భూమండలానికే అధినాథుడు వానిని చూసావా? ఓ రేగుచెట్టు! మనోహర మైన విహారాలు కల వానిని చూసావా? ఓ కడప వృక్షమా! అంటు ఆ గుండ్రని మోముల గొల్లభామలు ఆ అందాల కృష్ణుని వెతుకసాగారు.
10.1-1010-see.
punnaaga kaanavae! punnaagavaMditu@M; dilakaMba! kaanavae tilakaniTalu;
ghanasaara! kaanavae ghanasaaraSObhitu; baMdhooka! kaanavae baMdhumitru;
manmatha! kaanavae manmathaakaaruni; vaMSaMba! kaanavae vaMSadharuni@M;
jaMdana! kaanavae chaMdanaSeetalu@M; guMdaMba! kaanavae kuMdaradanu;
tae. niMdrabhoojama! kaanavae yiMdravibhavu@M;
guvala vRkshama! kaanavae kuvalayaeSu@M;
briyakapaadapa! kaanavae priyavihaaru;
nanuchu@M gRshNuni vedaki ra yyabjamukhulu.
పున్నాగ = ఓ పొన్నచెట్టు; కానవే = చూసావా; పున్నాగ = పురుషశ్రేష్ఠులచే, మగ ఏనుగుచేత; వందితున్ = నమస్కరింపబడిన వానిని; తిలకంబ = ఓ బొట్టుగ చెట్టు; కానవే = చూసితివా; తిలక నిటలు = తిలకము నుదుట కల వాడు; ఘనసార = ఓ కప్పురం చెట్టు; కానవే = చూసితివా; ఘనసార = మేఘము వంటి  కాంతిచే; శోభితున్ = ప్రకాశించు వానిని; బంధూక = ఓ మంకెన చెట్టు; కానవే = చూసితివా; బంధు = బంధుత్వపు; మిత్రున్ = మిక్కలి స్నేహము చూపు వానిని; మన్మథ = ఓ వెలగచెట్టు; కానవే = చూసితివా; మన్మథ = మన్మథుని వంటి; ఆకారుని = ఆకారము కల వానిని; వంశంబ = ఓ వెదురు పొద; కానవే = చూసితివా; వంశధరుని = మురళీధరుని; చందన = ఓ గంధంచెట్టు; కానవే = చూసితివా; చందన = మంచిగంధము వలె; శీతలున్ = చల్లని వానిని; కుందంబ = ఓ మొల్ల చెట్టు; కానవే = చూసితివా; కుందర = మల్లెమొగ్గల వంటి; దనున్ = పండ్లు కల వానిని; ఇంద్ర = ఓ మరువపు; భూజమ = చెట్టు; కానవే = చూసితివా; ఇంద్ర = ఇంద్రునివంటి; విభవున్ = వైభవము కల వానిని; కువల = ఓ రేగు; వృక్షమ = చెట్టు; కానవే = చూసితివా; కువలయేశున్ = భూమికి ప్రభువును; ప్రియక = ఓ కడప; పాదప = చెట్టు; కానవే = చూసితివా; ప్రియ = మనోజ్ఞమైన; విహారున్ = విహారములు కల వానిని; అనుచు = అంటు; కృష్ణుని = కృష్ణుని; వెదకిరి = అన్వేషించిరి; = ఆ యొక్క; అబ్జముఖులు = అందమైన గోపికలు {అబ్జ ముఖి - పద్మములవంటి మోములు కలామె, సుందరి}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~