Friday, October 18, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 89



aaraaTamu

1-252-క.
రాటము మది నెఱుఁగము
పోరాటము లిండ్ల కడలఁ బుట్టవు పురిలోఁ
జోరాటన మెగయదు నీ
దూరాటన మోర్వలేము తోయజనేత్రా!
          శ్రీకృష్ణుడు హస్తిన నుండి ద్వారకకి తిరిగి వచ్చాడు. పౌరులు ఆత్మీయ స్వాగత వచనాలు పలుకుతున్నారు – కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు ఎక్కడి కైనా వెళ్ళి నప్పుడు నీ వియోగాన్ని సహించలే మయ్యా.
1-252-ka.
aaraaTamu madi ne~ru@Mgamu
pOraaTamu liMDla kaDala@M buTTavu purilO@M
jOraaTana megayadu nee
dooraaTana mOrvalaemu tOyajanaetraa!
          ఆరాటము = ఆందోళనలు; మదిన్ = మా మనసులో; ఎఱుఁగము = లేనే లేవు; పోరాటములు = కలహములు; ఇండ్ల = గృహముల; కడలన్ = వద్ద; పుట్టవు = లేనే లేవు; పురి = నగరము; లోన్ = లో; జోరాటనము = దొంగతనము; ఎగయదు = లేనే లేదు; నీ = నీనుండి; దూరాటనము = దూరముగ నుండుట; ఓర్వలేము = భరించలేము; తోయజనేత్రా = కృష్ణ {తోయజ నేత్రుడు - (నీటినుండి పుట్టునది) పద్మముల వంటి నేత్రములు కల వాడు - కృష్ణుడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: