Saturday, October 5, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 77



తెలుగు భాగవత తేనె సోనల - 77

8-572 goDugO

8-572-మ.
గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
డుఁ గే నెక్కడ? భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్క? నిత్యోచిత కర్మ మెక్కడ? మ దాకాంక్షామితం బైన మూఁ
డుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నా పాలికిన్.
          వామనుడు బలి చక్రవర్తిని 3 అడుగుల మేర స్థలం దానం అడుగుతున్నాడు – అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.
8-572-ma.
goDugO jannidamO kamaMDaluvo naakun muMjiyO daMDamO,
vaDu@M gae nekkaDa bhoomu lekkaDa? karul, vaamaakshu, laSvaMbu le
kkaDa? nityOchita karma mekkaDa? Ma daakaaMkshaamitaM baina moo@M
DaDugul maeraya trOva kichchu Tadi brahmaaMDaMbu naa paalikin.
గొడుగొ = గొడుగు కాని ; జన్నిదమో = జంధ్యము కాని ; కమండులువో = కమండలము కాని ; నా = నా ; కున్ = కు ; ముంజియో = మొలత్రాడు కాని ; దండమో = యోగ దండము కాని ; వడుగున్ = బ్రహ్మచారిని ; ఏన్ = నేను ; ఎక్కడ = ఎక్కడ ; భూములు = భూభాగములు ; ఎక్కడ = ఎక్కడ ; కరుల్ = ఏనుగులు ; వామాక్షులు = జవరాండ్రు ; అశ్వంబులున్ = గుర్రములు ; ఎక్కడ = ఎక్కడ ; నిత్యోచితకర్మము = నిత్యకృత్యములు ; ఎక్కడ = ఎక్కడ ; మత్ = నా చేత ; కాంక్షితంబు = కోరబడినది ; ఐన = అయిన ; మూడు = మూడు (3) ; అడుగుల్ = అడుగుల ; మేరయ = పాటిది ; త్రోవకన్ = కాదనక ; ఇచ్చుట = దానము చేయుట ; అది = అదే ; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము ; నా = నా ; పాలికిన్ = పాలిటికి, మట్టుకు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

Unknown said...

A pearl poem by Bammera Pothana