Saturday, September 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 69

te~rava yokate


10.1-324-క.
తెవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
పించి నీ కుమారుఁడు
వెచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
10.1-324-ka.
te~rava yokate nidriMpa@Mga
ne~ri@M gaTTina valuva veeDchi nae Tagu taeluM
ga~rapiMchi nee kumaaru@MDu
ve~rachuchu nadi pa~rava nagiye vihitame? saadhvee!
        గోపికలు బాలకృష్ణుని అల్లరి ముచ్చట్లు యశోదకు చెప్తున్నారు – ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి.
           తెఱవ = ఇంతి {తెఱవ = తెఱ+వా (తెలివైన, నిండైన నోరు కలామె), స్త్రీ}; ఒకతె = ఒకర్తె; నిద్రింపగన్ = నిద్రపోతుంటే; నెఱిన్ = చక్కగా; కట్టిన = కట్టుకొన్న; వలువన్ = చీరను; వీడ్చి = విప్పి; నేటు = దృఢమైనది; అగు = ఐన; తేలున్ = తేలుచేత; కఱిపించి = కరిపించి; నీ = నీ యొక్క; కుమారుడు = పిల్లవాడు; వెఱచుచున్ = బెదిరిపోతూ; అది = ఆమె; పఱవన్ = పరుగెడు తుంటే; నగియెన్ = నవ్వెను; విహితమె = తెలియునా; సాధ్వీ = అబల {సాధ్వి = సాధు స్వభావము కలామె, స్త్రీ}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: