Saturday, September 7, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_48

కళలు గలుగుఁ గాక

10.1-1292-ఆ.
కళలు గలుగుఁ గాక; మల తో డగుగాక;
శివుని మౌళిమీఁదఁ జేరుఁ గాక;
యన్యు నొల్లఁ దపనుఁ డైన మత్పతి యని
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.
10.1-1292-aa.
kaLalu galugu@M gaaka; kamala tODagugaaka;
SivunimauLimee@Mda@M jaeru@M gaaka;
yanyu nolla@M dapanu@M Daina matpati yani
saadhvibhaMgi@M gamalajaati mogiDe.
          చంద్రుడు కళలు కలవాడు అయితే అగు గాక, లక్ష్మీదేవి తోబుట్టువు అయితే అగు గాక, శివుడు నెత్తిని పెట్టుకొన్న వాడు అయితే అగు గాక, అన్యుడు అయిన చంద్రుడి పొత్తు మా కక్కర లేదు. తపింప జేసే వాడే అయినప్పటికి, మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీజాతి ముడుచు కొంది. – ఇది మన కవి పోతన సూర్యాస్తమయ చంద్రోదయ వేళల వర్ణన.
          10.1-1292-ఆ.| కళలు = షోడశ కళలు, శోభలు; కలుగు గాక = ఉంటే ఉండ నిమ్ము; కమల = లక్ష్మీదేవి; తోడు = తోడబుట్టువు; అగుగాక = అయితే అయ్యుండ నిమ్ము; శివుని = పరమేశ్వరుని; మౌళి = శిఖ; మీదన్ = పైకి; చేరు గాక = ఎక్కి ఉంటే ఉండ నిమ్ము; అన్యున్ = ఇతరుని; ఒల్లన్ = అంగీకరించను; తపనుడు = తపింప జేయు వాడు; ఐనన్ = అయినప్పటికి; మత్ = నా యొక్క; పతి = భర్త; అని = అనుచు; సాధ్వి = పతివ్రత; భంగిన్ = వలె; కమల జాతి = కమలముల సమూహము; మొగిడెన్ = ముడుచుకొన్నాయి.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

Seenu said...

ఆహా..!! అద్భుతః..!!