Sunday, August 18, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_28



దీనుల కుయ్యాలింపను

8-133-క.
            దీనుల కుయ్యాలింపను,
            దీనుల రక్షింప, మేలు దీవనఁ బొందన్
            దీనావన! నీ కొప్పును;
            దీపరాధీన! దేవదేవ! మహేశ!
            ఓ దేవాధిదేవ! ఓ మహాప్రభూ! దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా, దీనబంధు! దీనరక్షక! నీకే తగు నయ్యా. - మొసలి చేత పీడింపబడు తున్న గజేంద్రుని మొర యందు అనుప్రాసలతో ఆలకించ మనటంలో బమ్మెరవారి పదాల వయ్యారాలు ఎంత మథురంగా ఉన్నాయో.
          దీనుల = దీనుల; కుయ్యాలింపను - కుయ్యి = మొర; ఆలింపను = వినుటకు; దీనుల - దీనులన్ = దీనులను; రక్షింప - రక్షింపన్ = కాపాడుటకు; మేలు = మంచి; దీవనఁ బొందన్ - దీవెనన్ = దీవనలను, దీవెనకోలు అనే నమస్కారాలు; పొందన్ = అందుకొనుటకు; దీనావన - దీన = దీనులను; అవన = కాపాడువాడ; నీ కొప్పును - నీ = నీ; కున్ = కు; ఒప్పున్ = తగి యున్నవి; దీనపరాధీన - దీన = దీనులకు; పరాధీన = వశమైన వాడ; దేవదేవ = హరి; మహేశ = హరి.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: